మహిళలు గుండెపోటుకు గురవడానికి వారాల ముందు నుంచి లక్షణాలు అనుభవిస్తారని పరిశోధనలు సూచిస్తున్నాయి. మహిళల్లో మాత్రమే కలిగే పాలిసిస్టిక్ అండాశయ వ్యాధులు, మధుమేహం, అధిక రక్తపోటు, ఎండో మెట్రియోసిస్ గుండెని ప్రమాదంలో పడేస్తాయి. మహిళలు ఆరోగ్యకరమైన, ధృడమైన గుండె కోసం తప్పకుండా ఈ ఆహారాలు మీ డైట్లో చేర్చుకోవాలి. గుండె జబ్బులు, గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడానికి మీ ఆహారంలో బీన్స్, బఠానీలు, కాయధాన్యాలు, శనగలు, చిక్కుళ్ళు మంచిది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరిచి గుండె లయలని స్థిరీకరించడంలో సహాయపడే ఆహారాల్లో ఆలివ్ ఆయిల్ మంచిది. డ్రై ఫ్రూట్స్, గింజలు నానబెట్టుకుని తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఒమేగా 3, ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. అరటిపండు, అవకాడో, గుమ్మడికాయలో శరీరానికి కావాల్సిన పొటాషియంని అందిస్తాయి. తృణధాన్యాలు: ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు వీటిలో అధికంగా ఉంటాయి. కొలెస్ట్రాల్ స్థాయిల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. వెల్లుల్లిలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అంతే కాదు నేచురల్ బ్లడ్ థిన్నర్ గా కూడా పని చేస్తుంది. నలుపు, తెలుపు, ఊలాంగ్, మాచా వంటి ఆర్గానిక్ టీలు గుండెకి మేలు చేస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ అధికంగా ఉంటుంది.