టైమ్ కి నిద్రపోకపోవడం వల్ల మధుమేహం, అలసట, ఊబకాయం, రక్తపోటు, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి అలసిపోయినట్టుగా అనిపిస్తే రాత్రి 9-10 మధ్య నిద్రపోవడానికి ప్రయత్నించాలి. ఉదయం త్వరగా నిద్రలేవాలి అనుకుంటే 7-8 గంటల మధ్య నిద్రపోవాలి. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రాత్రి 10 లేదా 11 గంటల మధ్య నిద్రపోవడం మంచిదని కొత్త అధ్యయనం చెప్తోంది. శరీరం ఎప్పుడు నిద్రపోవాలి, మేల్కొవాలి అనే వాటిని సిర్కాడియన్ రిథమ్ సూచిస్తుంది. అందుకే దీన్ని ‘నిద్ర చక్రం’ అని కూడా అంటారు. ఉదయం శరీరం సూర్యరశ్మికి గురైనప్పుడు మేల్కొని ఉండటానికి సహాయపడే హార్మోన్లను విడుదల చేస్తుంది. సూర్యుడు అస్తమించినప్పుడు విశ్రాంతినిచ్చేలా చేస్తుంది. శరీరంలో విడుదలయ్యే రసాయనాలు అలసిపోయిన అనుభూతిని కలిగిస్తాయి. ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన నిద్ర కావాలంటే వెలుగులు చిమ్మే కాంతి దీపాలు, ఆల్కహాల్, కెఫీన్ ను నివారించాలి. మెటబాలిక్ డిజార్డర్స్, గుండె జబ్బులు, స్ట్రోక్, మెదడు పనితీరు సక్రమంగా ఉండేలా చేయాలనుకుంటే తొమ్మిది గంటల నిద్ర అవసరం.