మందార పూలతో జుట్టుకు సత్తువ ఒత్తిడి, మానసిక ఆందోళన, వాతావరణంలోని కాలుష్యం, ఆహారంలో మార్పులు ఇవన్నీ జుట్టు పెరుగుదలపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. మందారలో జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే అమైనో ఆమ్లాలు ఉన్నాయి. ఈ అమైనో ఆమ్లాలు మీ జుట్టుకు కెరాటిన్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని పెంచుతాయి. కెరాటిన్ వల్ల వెంట్రుకలు విరగకుండా, పొడవుగా, బలంగా పెరుగుతాయి. అందుకే మందార జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుందని చెబుతోంది ఆయుర్వేదం. మందార ఆకుల్లో అధిక మొత్తంలో శ్లేష్మం కలిగి ఉంటుంది. ఇది జుట్టుకు సహజ కండిషనర్‌గా ఉపయోగపడుతుంది. మందార ఆకులను రుబ్బి చూడండి. జిగటగా వస్తుంది. ఈ జిగటైన పదార్థమే సహజ కండిషనర్‌గా ఉపయోగపడుతుంది. మందార పువ్వులతో తయారు చేసిన నూనెను మాడుకు రాయడం వల్ల, వెంట్రుకలు బలంగా ఆరోగ్యంగా పెరుగుతాయి. మందార పువ్వు, ఆకులను కలిపి మిక్సీలో వేసి తలకు పట్టించి చూడండి. ఇది జుట్టును శుభ్రపరచడంలో సహాయపడుతుంది. మందార పువ్వులు, ఆకులను మిక్సీలో పేస్ట్‌లా చేసి హెయిర్ మాస్క్‌గా వేసుకోండి. ఇవి మీ జుట్టుకు మెరుపును అందిస్తాయి.