జంక్ ఫుడ్ దూరం పెట్టాలా? ఇలా చేయండి జంక్ ఫుడ్ ఎవరినైనా త్వరగా తనకు బానిసను చేసుకుంటుంది. దాని రుచి దాసోహం అనేలా ఉంటుంది. జంక్ ఫుడ్ వల్ల ఊబకాయం, అధిక బరువు బారిన త్వరగా పడతారు. ఉదయం, మధ్యాహ్నం కనీసం 45 నిమిషాల పాటు చూయింగ్ గమ్ నమలడం వల్ల జంక్ ఫుడ్ పై ఆసక్తి తగ్గుతుంది. చూయింగ్ గమ్ అధిక చక్కెర కలిగిన స్నాక్స్ తినాలన్న కోరికను తగ్గిస్తుందని, పొట్ట నిండిన అనుభూతిని పెంచుతుంది. చూయింగ్ గమ్ వల్ల కేవలం తీపిగా ఉండే పదార్థాలనే కాదు, ఉప్పగా ఉండే స్నాక్స్ ను తినాలన్న కోరికా తగ్గిపోతుంది. చూయింగ్ గమ్ నయలడం వల్ల నోరు నిరంతరం పనిచేస్తుంది. ఇది ఏదైనా తినాలనే కోరికను తగ్గించేస్తుంది. నమలడం అనే ప్రక్రియ లాలాజలం, జీర్ణ ఎంజైముల విడుదలను ప్రేరేపిస్తుంది. ఇది పొట్ట నిండిన సంతృప్తి భావనను కలిగిస్తుంది. ఆకలి తగ్గడం వల్ల జంక్ ఫుడ్ తినాలన్న కోరిక కూడా తగ్గిపోతుంది.