బరువు తగ్గించే దగ్గర నుంచి ఫ్లూ వ్యాధులను అరికట్టే వరకు తేనె అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం క్రమం తప్పకుండా తీసుకుంటే ఎంతటి కొవ్వునైనా ఇట్టే కరిగించేస్తుంది. తేనె, గోరువెచ్చని నీటిని తాగడం వల్ల జీర్ణవ్యవస్థ సరిగా పనిచేస్తుంది. మలబద్ధకం, ఉబ్బరం, ఇతర జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. గోరువెచ్చని నీటితో దీన్ని కలపడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకి పోతాయి. శరీరం హైడ్రేషన్ గా ఉండేందుకు సహకరిస్తుంది. మనసు, మెదడు ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం ప్రతిరోజు కొద్దిగా తేనె, గోరువెచ్చని నీటిని కలిపి తాగండి. ఇది మనసుకి విశ్రాంతినిస్తుంది. గోరువెచ్చని, నీరు తేనె కలిపి తీసుకుంటే లాభాలు మాత్రమే కాదు దుష్ప్రభావాలు ఉన్నాయి. అధిక వేడి నీటిలో తేనె ఎప్పుడూ కలపకూడదు. దానిలోని పోషకాలు నశించిపోతాయి. అందుకే గోరువెచ్చని నీటిని మాత్రమే ఉపయోగించాలి. శుద్ధి చేసిన తేనె మాత్రమే వినియోగించాలి. ముడి తేనె తీసుకుంటే పొట్ట సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం కదా అని అతిగా తీసుకుంటే కొందరిలో పొట్ట ఉబ్బరం సమస్యల్ని తీసుకొస్తుంది. Image Credit: Pixabay/ Pexels