ఖాళీ పొట్టతో టీ తాగడం సురక్షితమేనా? మనదేశంలో సగం మందికి తెల్లారేది టీ తోనే. ఒక్కరోజు టీ తాగకపోయినా ఏదో కోల్పోయిన వారిలా అయిపోతారు. మన దేశంలో చాలామంది తమ రోజును పాలతో చేసిన టీ తోనే ప్రారంభిస్తారు. కొంతమంది పాలు వేయకుండా చేసే బ్లాక్ టీని కూడా తాగుతారు. పరగడుపున ఈ తేనీరు తాగడం వల్ల అల్సర్లు, కడుపు ఉబ్బరం, పొట్ట అసౌకర్యంగా ఉండడం, జీర్ణ రుగ్మతలు వంటివి భవిష్యత్తులో వచ్చే అవకాశం ఎక్కువ. బ్రష్ కూడా చేయకుండా టీ తాగే అలవాటు ఎంతో మందికి ఉంటుంది. దీనివల్ల నోటిలోని బ్యాక్టీరియా పొట్ట వరకు చేరుతుంది.పేగు అనారోగ్యానికి దారితీస్తుంది. ఖాళీ పొట్టతో అధిక కెఫీన్ ఉండే పానీయాలు తాగడం వల్ల యాసిడ్ రిఫ్లెక్స్ కు దారితీస్తుంది. గుండెల్లో మంట వస్తుంది. టీ తాగే వారిలో మూత్ర విసర్జన అధికంగా అవుతుంది. దీనివల్ల శరీరంలోని ద్రవాలు మూత్రం ద్వారా బయటికి పోతాయి. దీంతో శరీరం డీ హైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉంది. అందుకే ఖాళీ పొట్టతో టీ తాగేయడం మానుకోవాలి.