గుడ్డు పెంకులను కూడా తినాలట సంపూర్ణమైన ఆహారం అంటే కోడిగుడ్డే అని చెబుతారు పోషకాహార నిపుణులు. పోషకాహార నిపుణులు అప్పుడప్పుడు గుడ్డు పెంకులను కూడా తినమని చెబుతున్నారు. గుడ్డులో ఎన్ని పోషకాలు ఉంటాయో, గుడ్డు పెంకులలో కూడా అన్ని పోషకాలు ఉంటాయని వారు వివరిస్తున్నారు. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం గుడ్డు పెంకుల్లో కాల్షియం కార్బోనేట్, ప్రోటీన్లు ఇతర ఖనిజాలు ఉంటాయి. గుడ్డు పెంకులో సగం తిన్నా కూడా మన శరీరానికి కావలసిన రోజువారీ క్యాల్షియం దొరుకుతుంది. గుడ్డు పెంకులో లభించే కాల్షియం కార్బోనేట్ వల్ల ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయని చెబుతున్నారు. ఆస్టియోపోరొసిస్ వంటి ఎముకలను బలహీనపరిచే వ్యాధుల నుంచి గుడ్డు పెంకులు కాపాడతాయని వివరిస్తున్నారు వైద్యులు. గుడ్డుకు, గుడ్డు పెంకుకు మధ్య పలుచటి పొర ఉంటుంది. ఆ పొరను తింటే కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.