మనదేశంలోకి సగ్గుబియ్యం ఎలా ప్రవేశించాయంటే...

సగ్గుబియ్యం లేదా సాబుదానా... మన దేశంలో ఈ గింజలకు ఎంతో ప్రాధాన్యత ఉంది.

మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో సగ్గుబియ్యం వాడకం చాలా ఎక్కువ. మనం ఎంతగా తింటున్నా ఇది మన దేశానికి చెందిన పంట కాదని అంటారు.

1860లలో కేరళలోని ట్రావెన్‌కోర్ రాజ్యాన్ని ఆయిల్యం తిరుణాల్ రామవర్మ పాలించేవారు. అతనే తొలిసారిగా మన దేశంలో సగ్గుబియ్యాన్ని పరిచయం చేశారని చెబుతారు.

తన రాజ్యాన్ని ఘోరమైన కరువు పీడిస్తున్న సమయంలో సగ్గుబియ్యాన్ని దిగుమతి చేసుకోవడం మొదలుపెట్టారని చరిత్రకారులు వివరిస్తున్నారు.

బ్రెజిల్ నుండి రామవర్మ సోదరుడు తొలిసారిగా సగ్గు బియ్యాన్ని తయారు చేసే కర్రపెండలాన్ని మన దేశానికి తెచ్చారని చెబుతారు.

మరొక కథనం ప్రకారం 17వ శతాబ్దంలో పోర్చుగీసు వ్యాపారులు భారతదేశానికి కర్రపెండలం దుంపను పరిచయం చేశారని కూడా చెబుతారు.

ఆఫ్రికాలో దీన్ని ‘కాసావా’ అని పిలుస్తారు. ఈ దుంప అక్కడ ప్రధాన ఆహారం.

500 కిలోల కర్ర పెండలం దుంపలను సేకరిస్తే 100 కిలోల సగ్గుబియ్యం తయారవుతుంది.