తేనె ఎందుకు పాడవదో తెలుసా? బరువు తగ్గడం నుంచి, అందాన్ని పెంచుకోవడం వరకు అన్ని రకాల డైట్‌లలో తేనే కచ్చితంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచుకోవడం కోసం రోజు ఒక స్పూను తేనె తింటే చాలు. తేనె చరిత్ర ఈనాటిది కాదు. వేల సంవత్సరాల నుంచి పాడవకుండా ఉన్న తేనె కుండలు లభించాయి. ఈజిప్టు సమాధుల్లో మూడు వేల ఏళ్లనాటి తేనె డబ్బాలు కూడా బయటపడ్డాయి. వాటి రుచి చూస్తే చాలా స్వచ్ఛంగా, తాజాగా ఉండడం పరిశోధకులను ఆశ్చర్యపరిచింది. స్వచ్ఛమైన తేనెలో తేమశాతం సున్నా. తేమ లేని చోట బ్యాక్టీరియా, వైరస్ పెరగలేదు. అందుకే తేనెలో ఏ బ్యాక్టీరియా గాని, వైరస్ గాని ఉండవు. దాని కారణంగా అది చెడిపోకుండా ఎక్కువ కాలం ఉంటుంది. కల్తీ తేనెలలో మాత్రం తేమ ఉంటుంది.కాబట్టి అవి పాడైపోతాయి. తేనె పాడయిందంటే అర్థం అది కల్తీదని.