బేకింగ్ సోడా వంటలకు మంచి రుచి ఇస్తుంది. కుకీస్, కేక్స్ లో బేకింగ్ సోడా తప్పనిసరిగా వేస్తారు.

కానీ దీని వల్ల మీరు అందం కూడా పొందొచ్చు. అదెలాగా అని ఆలోచిస్తున్నారా? ఈ టిప్స్ పాటించి చూడండి మెరిసిపోతారు.

బేకింగ్ సోడా స్క్రబ్బింగ్, ఎక్స్ ఫోలియేషన్ కోసం చక్కగా పనిచేస్తుంది. మృతకణాలు తొలగిస్తుంది.

బ్లాక్ హెడ్స్ తొలగిస్తుంది. జిడ్డు చర్మం అయితే రంధ్రాలను అన్ లాగ్ చేస్తుంది. నూనె లేని చర్మం మీకు ఇస్తుంది.

బేకింగ్ సోడాతో పళ్ళు తోముకుంటే తెల్లగా మిలమిల మెరిసిపోతాయి. కాఫీ, టీ, కోలా వల్ల ఏర్పడే మరకలు తొలగించేస్తుంది.

ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలను ఉత్పత్తి చేసే బ్యాక్టీరియాని చంపేస్తాయి.

శరీర దుర్వాసనను సహజంగా తొలగించి తాజా అనుభూతిని కలిగిస్తుంది.

నెయిల్ క్లీనర్ గా పని చేస్తుంది. బేకింగ్ సోడా వేసిన్ నీళ్ళలో చేతులు నానబెట్టడం వల్ల దుమ్ము, ధూళిని తొలగించేస్తుంది.

బేకింగ్ సోడా వేసిన నీటిలో పాదాలు నానబెడితే మృదువుగా మారతాయి. చెడు వాసన పోగొడుతుంది.

హెయిర్ క్లెన్సర్ గా మారి జుట్టు నుంచి అదనపు నూనె తొలగించి రీఫ్రెష్ గా మార్చేస్తుంది.

వడదెబ్బ తగిలిన చర్మానికి బేకింగ్ సోడా రాయడం వల్ల అలర్జీ, వాపుని తగ్గిస్తుంది.

గోళ్ళపై ఉన్న మరకలు తొలగించి శుభ్రంగా కనిపించేలా చేస్తుంది.
Image Credit: Pexels