ఛాతీలో నొప్పిగా ఉంటుంది

ఆక్సిజన్ అందకపోవడం వల్ల గుండె లయలో మార్పులు సంభవిస్తాయి.

ఒక్కోసారి హృదయ స్పందన చాలా వేగంగా ఉంటుంది. గుండెల్లో దడగా అనిపిస్తుంది.

గురక వస్తుంది. ఊపిరితిత్తుల్లో ద్రవం పేరుకుపోవడం వల్ల గుండె వైఫల్యం చెంది గురక వస్తుందని వైద్యులు చెబుతున్నారు.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది

మూర్చలు వస్తాయి. గుండె కొట్టుకోవడం ఆగిపోతుందని సంకేతం.

మైకం, వికారం, వాంతులు, తల తిరగడం వంటివి కూడా సంభవిస్తాయి.

కార్డియాక్ అరెస్ట్ వల్ల గుండె ఒక్కసారిగా కొట్టుకోవడం ఆగిపోతుంది. మెదడుకు రక్తాన్ని పంప్ చేయడం ఆపేస్తుంది.

సీపీఆర్ రివర్స్ కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు రోగికి చేస్తే కొంతవరకు ప్రాణాలు కాపాడవచ్చు.

కార్డియాక్ అరెస్ట్ అంటే.. అకస్మాత్తుగా గుండె ఆగిపోవడం. హార్ట్ ఎటాక్ అనేది గుండె జబ్బుల వల్ల ఏర్పడే సమస్య.

మీలోనూ ఈ లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యుని దగ్గరకి వెళ్ళండి.
Image Credit: Pixabay/ Pexels