వాల్‌నట్ నూనెతో అందం - ఆరోగ్యం వాల్‌నట్స్ చాలా ఖరీదైనవి. అందుకే వీటితో చేసే నూనె గురించి చాలా తక్కువ మందికి తెలుసు. వాల్‌నట్ చెట్టు నుంచి వచ్చే గింజల నుంచి ఈ నూనెను తయారు చేస్తారు. ఈ నూనెలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఈ నూనెను రోజుకో స్పూన్ తాగినా కూడా ఎన్నో రకాలుగా ఆరోగ్యానికి మంచిది. చర్మ సౌందర్యాన్ని కూడా ఇది పెంపొందిస్తుంది. ఈ నూనెలో ఉండే ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు మెదడు ఆరోగ్యానికి కూడా సహకరిస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి. క్యాన్సర్, ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను రాకుండా చేయడంలో ఈ నూనె ముందుంటుంది. ఈ నూనెలో విటమిన్ E అధికంగా ఉంటుంది. విటమిన్ E చర్మానికి అందాన్ని ఇవ్వడంలో సహకరిస్తుంది. ఈ ఆయిల్ వాడడం వల్ల ఎగ్జిమా, సొరియాసిస్ వంటి చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయి. ఇతర వంట నూనెలతో పోలిస్తే ఈ నూనెలో తక్కువ క్యాలరీలు ఉంటాయి. కాబట్టి బరువు తగ్గడానికి ఇది మంచి ఎంపిక.