డయాబెటిస్ ఉంటే చెరుకు తినవచ్చా? మధుమేహం ఉన్నవారు ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటించాలి, లేకుంటే అనారోగ్యం బారిన పడతారు. చెరుకు రసం తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ను కలిగి ఉంటుంది. అలా అని డయాబెటిక్ రోగులు దాన్ని తాగకూడదు. దానిలో గ్లైసిమిక్ లోడ్ అధికంగా ఉంటుంది. అంటే మీ రక్తంలో చక్కెర స్థాయిలు పై ఇది అధికంగా ప్రభావాన్ని చూపిస్తుంది. చెరుకు రసంలో ఉండే చక్కెర స్వచ్ఛమైనది కాదు. ఈ చక్కెర సూక్రోజ్ రూపంలో 70 నుంచి 75% వరకు ఉంటుంది. సుక్రోజ్ కూడా చక్కెరకు మరో రూపమే. అందుకే మధుమేహం ఉన్నవారు చెరుకును లేదా చెరుకు రసాన్ని తరచూ తాగకూడదు. భారీ మొత్తంలో చక్కెర రక్తంలో చేరే అవకాశం ఉంది. అలాగని దీన్ని పూర్తిగా మానేయమని కూడా సూచించడం లేదు. అప్పుడప్పుడు దీన్ని తినవచ్చు. బయట చెరుకు రసం కొనేటప్పుడు దానిలో పంచదార కలిపి ఇస్తుంటారు వ్యాపారులు. కాబట్టి చెరుకు రసంలో పంచదార కలపకుండా స్వచ్ఛమైనది మాత్రమే తాగాలి. మూడు నాలుగు నెలలకు ఒకసారి తాగితే ఎలాంటి ప్రమాదం ఉండదు.