ఈ సమస్యలుంటే కిస్మిస్‌లు తినకండి

కిస్మిస్, మునక్కా...ఎలా పిలిచినా అవి ఎండిన ద్రాక్షలే. ప్రాంతాలను బట్టి ఒక్కో పేరుతో పిలుచుకుంటారు.

దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కోలుకోవడానికి ఇది ఎంతో సహకరిస్తుంది.

అయితే కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. తినే ముందు వైద్యులను సంప్రదించాలి.

రక్తాన్ని పలచబరిచే మందులను వాడుతున్న వారు కిస్మిస్‌లను దూరం పెట్టాలి.

ఎందుకంటే ఆ మందులతో ఈ కిస్మిస్‌లు ప్రతికూల పరస్పర చర్యను జరిపే అవకాశం ఉంది. దీనివల్ల వారి ఆరోగ్యం మరింత దిగజారవచ్చు.

గర్భవతిగా ఉన్నప్పుడు, పిల్లలకు పాలు ఇస్తున్నప్పుడు కూడా కిస్మిస్‌లను దూరం పెడితే మంచిది.

వీటిని అధికంగా తింటే మాత్రం అనారోగ్యాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా డయేరియా వచ్చే అవకాశం ఉంది.

జీర్ణాశయ సమస్యలు ఉన్నవారు, బలహీనమైన జీర్ణశక్తిని కలిగి ఉన్నవారు కిస్మిస్‌లను తక్కువగా తినాలి.