వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించింది.

వేసవిలో ఘనాహారం కన్నా ద్రవాహారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. రోజంతా ప్రతి గంట ఎంతో కొంత నీరు త్రాగుతూనే ఉండాలి.

నీటిలో కీరాదోస, నిమ్మకాయ, పుదీనా ఆకులు కూడా వేసుకొని నానబెట్టి తాగితే శరీరం డిహైడ్రేషన్ బారిన పడదు.

చెమట కారణంగా ఉప్పు అధికంగా బయటికి పోతుంది. అందుకే వేసవిలో నిమ్మకాయ నీటిలో కాస్త ఉప్పు కలుపుకొని తాగడం ముఖ్యం.

నారింజ, పుచ్చకాయ, నిమ్మకాయ, మామిడి, కీరా దోస వంటి అధిక నీటి కంటెంట్ ఉన్న పండ్లను తినాలి.

టీ, కాఫీలాంటి పానీయాలు తాగే అలవాటు ఉంటే తీవ్రమైన వేసవిలో ఆ రెండింటిని మానుకోవడం ముఖ్యం.

అధిక ప్రోటీన్ ఉన్న ఆహారాలు జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి వేసవిలో ఆ ఆహారాలను దూరం పెట్టాలి.

రాత్రి మిగిలిపోయిన అన్నం, కూరలు ఉదయం లేచి తినడం వంటివి చేయకూడదు. పాత ఆహారాలు తినడం మానుకోవాలి.