ఎర్ర అరటి పండ్లు కచ్చితంగా తినాలా? పసుపు అరటిపండ్లు అందరూ అధికంగా తింటారు. కానీ ఎరుపు అరటిపండ్లను పెద్దగా తినరు. వాటిని కచ్చితంగా తినాల్సిందే. ఈ పండ్లలో విటమిన్ సి, బీటా కెరాటిన్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వీటిలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. కాబట్టి మలబద్ధకం సమస్య రాదు. జీర్ణ క్రియ సక్రమంగా జరుగుతుంది. గుండె మంట వంటివి తగ్గుతాయి. యాంటీ అసిడిటీ లక్షణాలు వీటిలో ఎక్కువ. గుండె ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. రక్తహీనత సమస్య నుంచి ఇవి బయటపడేస్తాయి. అందుకే పిల్లలు, మహిళలు వీటిని కచ్చితంగా తినాలి. మూడ్ స్వింగ్స్ నుంచి ఈ పండు బయటపడేస్తుంది. వీటిలో బి6 పుష్కలంగా ఉంటుంది. కంటి చూపుకు అవసరమయ్యే విటమిన్ A ఈ పండ్లలో అధికంగా ఉంటుంది.