ఒంటె పాలు మధుమేహులకు చాలా మేలు చేస్తాయని అనేక అధ్యయనాలు కూడా నిరూపిస్తున్నాయి.

ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఇమ్యూనోగ్లోబులిన్స్, లాక్టోఫెర్రిన్లు సమృద్ధిగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని అందిస్తాయి.

ఆవుపాల మాదిరిగానే ఒంటె పాలు కూడా విస్తృతంగా ఉపయోగిస్తారు. ఎన్నో పోషక విలువలు కలిగి ఉంటాయి.

కాల్షియం, కొవ్వు, ఐరన్, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. తక్కువ మొత్తంలో కార్బోహైడ్రేట్లు ఉన్నాయి. డయాబెటిక్ రోగులకు మంచిది.

షుగర్ లెవల్స్ అదుపులో ఉంచుకోవాలంటే రోజుకి 500 ఎంఎల్ ఒంటె పాలు తీసుకోవాలని సిఫార్సు చేస్తున్నారు.

ఒంటె పాలు కాచుకుని తాగితే అందులోని పోషకాలు తగ్గిపోతాయి. అందుకని పచ్చి పాలు తాగడం మంచిదని చెప్తున్నారు.

నాలుగు కప్పుల ఒంటె పాలు సుమారుగా 52 యూనిట్ల ఇన్సులిన్ అందిస్తుంది.

ప్రతిరోజు రెండు కప్పుల ఒంటె పాలు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులోనే ఉంటాయి.

ఆవు పాల కంటే ఒంటె పాలు చాలా ఖరీదైనవి. 200 గ్రాముల ఒంటె పాలతో చేసిన మిల్క్ పౌడర్ రూ.700.

గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, పిల్లలు, వృద్ధులు, రోగనిరోధక వ్యవస్థ తక్కువగా ఉన్న వాళ్ళు పచ్చి పాలు అసలు తీసుకోకూడదు.

రక్తం తక్కువగా ఉన్న వాళ్ళు ఈ పాలని తీసుకునే ముందు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి.
Image Credit: Unsplash/ Pexels