డయాబెటిస్ తగ్గాలా? ఇలా చేయండి మధుమేహం ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చూసుకోవాలి. రాత్రి నిద్రపోయే ముందు నాలుగు పనులు చేయడం వల్ల, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగవు. రాత్రి నిద్రపోయే ముందు చమోమిలే టీ ఒక కప్పు తాగాలి. దీన్ని చామంతి పూలతో తయారుచేస్తారు. బాదం పప్పులను ఉదయం నానబెట్టి రాత్రి తినడం అలవాటు చేసుకోవాలి. ఇవి ఏవైనా తినాలన్న కోరికలను తగ్గిస్తాయి. ఒక స్పూను మెంతి గింజలను నీటిలో నానబెట్టి రాత్రి నిద్రపోయే ముందు వాటిని తినాలి. మెంతి గింజల్లో అద్భుతమైన హైపోగ్లైసిమిక్ గుణం ఉంది. ఇది శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. నిద్రపోవడానికి పావుగంట ముందు వజ్రాసనంలో 15 నిమిషాలు కూర్చోవాలి. ఇది రక్తప్రసరణను మెరుగుపరిచి, రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి.