ఖాళీ పొట్టతో ఓట్ మీల్ వాటర్ తాగితే ఎన్నో లాభాలు ఓట్స్ మన దేశంలో పండకపోయినా, వాటిలో ఉన్న ఆరోగ్య గుణాల కారణంగా ఇప్పుడు మన దగ్గర వాడుక పెరిగింది. ముఖ్యంగా అది మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలు ఉన్నవారికి వరంగా మారింది. ఉదయానే పరగడుపున, ఖాళీ పొట్టతో ఓట్ మీల్ వాటర్‌ను తాగడం వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఉదయం పూట ఖాళీ పొట్టతో ఈ ఓట్స్ నీటిని తీసుకుంటే శరీరంలోని వ్యర్ధాలు,టాక్సిన్లు బయటికి పోతాయి. ఓట్స్ వాటర్ తీసుకునే వారిలో రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఓట్స్ వాటర్ తయారు చేయడానికి ముందు రోజు రాత్రి రెండు గ్లాసుల నీటిలో ఒక చిన్న కప్పు ఓట్స్‌ను వేసి నానబెట్టాలి. తర్వాత ఉదయాన్నే ఆ నీళ్లతో పాటు మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. అది నీళ్లలాగా ఉంటుంది. ఒక గ్లాసులో ఆ మిశ్రమాన్ని వేసుకొని, కాస్త తేనె, చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసి కలుపుకోవాలి. దాన్ని ప్రతిరోజూ ఉదయం ఖాళీ పొట్టతో తాగాలి.