స్పెషల్ డ్రింక్ తాండై - రెసిపీ ఇదిగో

బాదం పప్పులు - ఐదు
జీడిపప్పులు - ఐదు
పిస్తా పప్పులు - ఐదు
పుచ్చకాయ గింజలు - ఒక స్పూను
గసగసాలు - రెండు స్పూన్లు

పచ్చి యాలకులు - ఐదు
దాల్చిన చెక్క - చిన్న ముక్క
నల్ల మిరియాలు - ఒక స్పూను
పాలు - ఒక కప్పు
పంచదార - ఒకటిన్నర కప్పు
గులాబీ రేకులు - గుప్పెడు

బాదం, జీడిపప్పు, పిస్తా, పుచ్చకాయ గింజలు, గసగసాలు, పచ్చి యాలకులు, దాల్చిన చెక్క, మిరియాలు అన్ని కలిపి పొడిలా చేసుకోవాలి.

పాలు మరుగుతున్నప్పుడు పంచదారను వేసి కలపాలి.

మరుగుతున్న పాల మిశ్రమంలో, ముందుగా మిక్సీలో చేసి పెట్టుకున్న పొడి వేయాలి.

మిశ్రమం మరీ నీళ్లలా కాకుండా, అలానే చిక్కగా కాకుండా... మధ్యస్థంగా ఉన్నప్పుడు స్టవ్ కట్టేయాలి.

ఫ్రిజ్ లో పెట్టి కూల్ అయ్యేలా చేయాలి. తాగే ముందు గులాబీ రేకులను చల్లుకోవాలి.


వీటిలో నట్స్ వాడాం కాబట్టి, ఆరోగ్యానికి చాలా మంచిది.