జుట్టు పెరుగుదలను ప్రొత్సహించి.. జుట్టు రాలడాన్ని నియంత్రించే కొన్ని జింక్ రిచ్ ఫుడ్స్ గురించి తెలుసుకుందాం. బచ్చలికూర, ఆకుకూరల్లో జింక్, ఐరన్, విటమిన్స్ ఏ, సి, ఫొలేట్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి జుట్టును బలంగా ఉంచుతాయి. గుమ్మడి గింజల్లో జింక్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టుకు పెరుగుదలకు సహాయపడతాయి. కాయధాన్యాల్లో ఫొలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. ప్లాంట్ బేస్డ్ ప్రొటీన్ లో జింక్ అధికంగా ఉంటుంది. పెరుగులో ప్రొబయోటిక్స్ ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. బాదం, జీడిపప్పులో జింక్ అధిక మొత్తంలో ఉంటుంది. జుట్టు పెరుగుదలను ప్రొత్సహిస్తాయి. గుడ్లలో ప్రొటీన్ తోపాటు జింక్, బయోటిన్ పుష్కలంగా ఉంటుంది. జుట్టు కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. డార్క్ చాక్లెట్ లో ఐరన్, జింక్, కాపర్ వంటి మినరల్స్ ఉంటాయి. జుట్టును వేగంగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది. శనగల్లోనూ జింక్, మాంగనీస్ ఉంటుంది. ఇవి జుట్టు పెరుగుదలను బలోపేతం చేస్తాయి.