వెల్లుల్లితో ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు పొందవచ్చు. అయితే దీనిని రోజూ తీసుకోవచ్చా అంటే? తీసుకోవచ్చు కానీ లిమిటెడ్గా తీసుకోవాలి. వెల్లుల్లిలోని సల్ఫర్ సమ్మేళనాలు లోపలి నుంచి శరీరభాగాలను శుభ్రపరుస్తాయి. రోజూవారి ఒత్తిడిని తగ్గించుకునేందుకు వెల్లుల్లి హెల్ప్ చేస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరిచి గుండె జబ్బులను దూరం చేస్తుంది. రక్తం గడ్డకట్టకుండా చేయడంతో పాటు తెల్ల రక్త కణాల స్థాయిలు మెరుగుపరుస్తాయి. జీర్ణక్రియ సమస్యలను దూరం చేయడంలో వెల్లుల్లి ముఖ్యపాత్ర పోషిస్తుంది. చలికాలంలో రెగ్యూలర్గా తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. (Image Source : Unsplash)