కొన్ని రకాల ఆహారాలు తీసుకున్నపుడు వయసు ప్రభావం కనిపించదట. వీటిని యాంటీ ఏజింగ్ ఆహారంగా చెబుతారు.

స్ట్రాబెర్రీ, రాస్ బెర్రీ, బ్లూబెర్రీ వంటి బెర్రీలన్నింటిలోనూ ఆంథో సియానిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.

బాదాములు, అవిసెగింజలు, వాల్నట్స్ వంటి గింజల్లో విటమిన్ ఇ, ఒమెగా3 ఫ్యాటీయాసిడ్లు ఉంటాయి. ఆక్సిడేటివ్ ఒత్తిడి తగ్గిస్తాయి.

ఫ్లవనాయిడ్స్, యాంటీఆక్సిడెంట్స్ కలిగిన డార్క్ చాక్లెట్ చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. ఆక్సిడేటివ్ ఒత్తిడి తగ్గిస్తుంది.

పాలకూర వంటి ఆకుకూరల్లో విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి పూర్తిస్థాయి ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.

అవకాడోలో విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

గ్రీన్ టీలో పాలీఫినాల్, కెటాచిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. చర్మ ఆరోగ్యంతో పాటు పూర్తి స్థాయిలో ఆరోగ్యానికి మేలుచేస్తాయి.

సాల్మన్ వంటి నూనె కలిగిన చేపల్లో ఒమెగా3 ఫ్యాటీయాసిడ్లు ఉంటాయి. చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

Images courtesy : Pexels