కొత్త ల్యాప్‌టాప్ కొనేటప్పుడు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే. వర్క్, ఆన్‌లైన్ క్లాసుల కోసం కొనే ల్యాప్‌టాప్‌లకు రూ.50 వేలకు మించి పెట్టక్కర్లేదు. ఈ ధరలో ల్యాప్‌టాప్ కొంటే కనీసం ఐ5 ప్రాసెసర్ ఉండేలా చూసుకోండి. కనీసం 8 జీబీ ర్యామ్ ఉండాలి. 4 జీబీ ర్యామ్ ఉన్న ల్యాప్‌టాప్‌లు కొంటే అవి బాగా స్లోగా పని చేస్తాయి. కనీసం 512 జీబీ స్టోరేజ్ ఉండేలా చూసుకుంటే బెటర్. హెచ్‌డీడీ కంటే ఎస్ఎస్‌డీ స్టోరేజ్ ఉండే ల్యాప్‌టాప్‌లు మెరుగ్గా పనిచేస్తాయి. కొన్ని కంపెనీలు ల్యాప్‌టాప్‌తో పాటు యాంటీ వైరస్‌ను కూడా అందిస్తాయి. వాటిలో పవర్‌ఫుల్ యాంటీ వైరస్ ఉండే చూసుకోండి. యాంటీ వైరస్ మీ ల్యాప్‌టాప్‌ను సైబర్ దాడుల నుంచి కాపాడుతుంది.