శ్రీముఖికి ఉంగరాలు పెట్టుకోవడం అలవాటు. ఆమె చేతి వేళ్ళకు ఎప్పుడూ మూడు ఉంగరాలు ఉంటాయి. రీసెంట్ అమెరికా టూర్‌లోనూ శ్రీముఖి ఉంగరాలు పెట్టుకున్నారు. మూడు ఉంగరాల్లో... డైమండ్స్ పొడిగినట్టు ఉండే శ్రీముఖి రింగ్ ఒకటి ఫోటోల్లో హైలైట్ అయ్యింది. డైమండ్ రింగ్ వెనుక కథేంటి? అని కొందరు అనుకుంటున్నారు. రింగ్ వెనుక పెద్ద కథ ఏమీ లేదని, అది శ్రీముఖి స్వయంగా కొనుకున్న ఉంగరం అని టాక్. అమెరికాలో పలు నగరాల్లో ఎస్. తమన్ కాన్సర్ట్ జరిగింది. డల్లాస్ లో శ్రీముఖి ఈ స్టైల్ లో సందడి చేశారు. 'అలా... అమెరికాపురములో' అని ఈ ఫోటోలను శ్రీముఖి పోస్ట్ చేశారు. అమెరికాలోని హోటల్ రూమ్ లో శ్రీముఖి శ్రీముఖి డ్రస్ కూడా హైలైట్ అయ్యింది.