మధుమేహుల కోసం రాగి ఇడ్లీ రెసిపీ

ఇడ్లీ పిండి - రెండు కప్పులు
రాగి పిండి - అరకప్పు
ఉప్పు - రుచికి సరిపడా

ముందుగా సాధారణ ఇడ్లీల కోసం ఎలాగైతే రుబ్బు రెడీ చేసుకుంటారో అలా రెండు కప్పుల రుబ్బు సిద్ధం చేసుకోవాలి.

ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి అరకప్పు నీళ్లు పోయాలి.

నీళ్లు వేడెక్కాక రాగిపిండిని వేసి ఉండల్లేకుండా కలుపుకోవాలి. కాస్త ఉప్పు కూడా వేయాలి.

రాగి పిండి చిక్కగా ఉడికాక, అందులో ముందుగా కలుపుకున్న ఇడ్లీ పిండిని కూడా వేసి బాగా కలపాలి.

పిండి కాస్త చిక్కగా అయ్యేవరకు గరిటెతో కలుపుతూనే ఉండాలి. స్టవ్ కట్టేసి ఈ పిండిని పక్కన పెట్టుకోవాలి.

పిండి గోరువెచ్చగా అయ్యే వరకు వదిలేయాలి.

ఇప్పుడు ఇడ్లీ పాత్రలకు కాస్త నూనె రాసి ఈ పిండిని వేసి ఇడ్లీ కుక్కర్లో పెట్టేయాలి.


పదినిమిషాల్లో ఇడ్లీ రెడీ అయిపోతుంది.