మగవారిలో లంగ్స్ క్యాన్సర్ లక్షణాలు ఇవే



మన దేశంలో క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య అధికంగానే ఉంది. పురుషులు ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన ఎక్కువగా పడుతున్నారు.



ఊపిరితిత్తుల క్యాన్సర్ సోకినప్పుడు నిరంతరంగా దగ్గు వస్తుంది.



ఛాతీలో సన్నటి నొప్పి కనిపిస్తుంది. ఊపిరి తీసుకోవడం కష్టంగా మారుతుంది.



గొంతు బొంగురు పోయినట్టు అవుతుంది. స్వరం కూడా మారుతుంది. మెడ దగ్గర వాపు కనిపిస్తుంది.



హఠాత్తుగా బరువు తగ్గిపోతారు. దగ్గినప్పుడు వచ్చే కఫంలో రక్తం కనిపిస్తుంది.



దగ్గు వారం రోజులు కంటే ఎక్కువ కాలం ఉంటే దాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. వెంటనే వైద్యులను కలవడం అవసరం.



కుటుంబంలో ఎవరికైనా ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉంటే వారసత్వంగా వచ్చే అవకాశం ఉంది.



ముఖ్యంగా మగవారు ధూమపానం తాగడం పూర్తిగా మానేయాలి.