చాక్లెట్లు రోజూ తింటే వచ్చే సైడ్ ఎఫెక్టులు ఇవే



చాక్లెట్లు మితంగా తినడం వల్ల ఆరోగ్యం లభిస్తుంది. కానీ అతిగా తింటే మాత్రం చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది.



ఈ చాక్లెట్లను అతిగా తింటే వచ్చే ఆరోగ్య సమస్యల గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.



చాక్లెట్లు అతిగా తినే వారిలో పొట్ట ఉబ్బరం, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు కలిగే అవకాశం ఎక్కువ.



చాక్లెట్లలో చక్కెర, కొవ్వు అధికంగా ఉంటాయి. ఇవన్నీ కూడా పొట్టనొప్పికి కారణం అవుతాయి.



అధిక చక్కెర కంటెంట్ పేగులో హానికరమైన బ్యాక్టీరియా పెరగడానికి దారితీస్తుంది.



చాక్లెట్లలో ఉండే చక్కెర రక్తంలో చక్కెర స్థాయిలను అమాంతం పెరిగేలా చేస్తుంది. దీనివల్ల చాక్లెట్లు అధికంగా తినేవారు తీవ్ర అలసటకు, చికాకుకు లోనవుతారు.



బరువు కూడా త్వరగా పెరుగుతారు. అధిక రక్తపోటు, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ప్రమాదం కూడా పెరుగుతుంది.



చాక్లెట్లు మితంగా తీసుకుంటే శరీరానికి చురుకుదనాన్ని అందిస్తుంది. అదే అమితంగా తీసుకుంటే అలసటను పెంచుతుంది.