Image Source: pexels.com

వంటగదిలో మీరు చేసే ఈ చిన్న తప్పులు అనారోగ్యానికి గురిచేస్తాయి. వంట చేసేటప్పుడు ఈ చిట్కాలు ఫాలో అయితే ఆరోగ్యంగా ఉంటారు.

Image Source: pexels.com

ప్యాకేజీ లేదా సీల్ తెరిచిన ఆహారాన్ని కొనవద్దు. ప్రాసెసింగ్ లేదా ట్రాన్స్ పోర్టు సమయంలో కలుషితమయ్యే ప్రమాదం ఉంది.

Image Source: pexels.com

మీరు వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు పచ్చి మాంసంతోపాటు ఇతర వస్తువులను ఉంచకూడదు.

Image Source: pexels.com

పచ్చిమాంసం కోసం ప్రత్యేకంగా చాపింగ్ బోర్డును ఉంచుకోవాలి. కూరగాయలు, మాంసం ఒకే బోర్డుపై కట్ చేస్తే ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది.

Image Source: pexels.com

అన్నం వండిన గంటలోపే తినాలి లేదంటే బాసిల్లస్ సెరియస్ బ్యాక్టీరియా ప్రవేశించి వాంతులు, విరేచనాలకు కారణం అవుతుంది.

Image Source: pexels.com

బెర్రీస్‌ను ఖచ్చితంగా కడిగిన తర్వాతే తినాలి. వీటిలో బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది.

Image Source: pexels.com

పుచ్చకాయ, హనీడ్యూ మెలోన్ వంటి నేలపై పెరిగే పండ్లలో ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. బాగా కడిగిన తర్వాతే తినాలి.

Image Source: pexels.com

చిన్న స్క్రాచ్ కూడా హానికరమైన బ్యాక్టీరియాను మోసుకెళ్తుంది. గాయం అయిన వెంటనే కట్టు కట్టుకోండి.

Image Source: pexels.com

వేడి ఆహారాన్ని ఫ్రిజ్ లో ఉంచకూడదు. బ్యాక్టీరియా వృద్ధి చెందే ప్రమాదం ఉంటుంది. చల్లగా ఉన్న తర్వాత ఫ్రిజ్ లో పెట్టాలి.