ఖర్జూరాలు మంచి పోషకాలు కలిగి ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి.

అందుకే గర్భధారణ సమయంలో డేట్స్ తినాలని సూచిస్తారు.

ఖర్జూరంలో ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ కె వంటి విటమిన్లు ఉంటాయి.

డేట్స్​లోని పోషకాలు శిశువు అభివృద్దికి, తల్లి శ్రేయస్సుకు మంచివి.

ఖర్జూరంలోని కార్బోహైడ్రేట్లు శక్తిని అందించి.. అలసటను దూరం చేస్తాయి.

దీనిలో ఫైబర్ ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే మలబద్ధకాన్ని నివారిస్తుంది.

డేట్స్​లలో ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు తల్లి ఆరోగ్యానికి తోడ్పడుతాయి.

ప్రెగ్నేన్సీలో మధుమేహంతో బాధపడేవారు వీటికి దూరంగా ఉండడమే మంచిది. (Images Source : Unsplash)