దానిమ్మలో విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు , ఐరన్ ఉంటుంది. దానిమ్మను తింటే హిమోగ్లోబిన్ పెరగడంతోపాటు శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. అరటిపండ్లలో విటమిన్ B6, ఐరన్ హిమోగ్లోబిన్ ఉత్పత్తికి తోడ్పడతాయి. రక్తంలో ఆక్సిజన్ రవాణ పెంచుతాయి. యాపిల్స్ లో విటమిన్ C, ఐరన్ పుష్కలంగా ఉన్నాయి.హిమోగ్లోబిన్‌ను పెంచడంతో సహాయపడతాయి. ఆరేంజ్ లో విటమిన్ C పుష్కలంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన హిమోగ్లోబిన్ లెవల్స్ పెంచడంలో సహాయపడుతుంది . స్ట్రాబెర్రీలలో విటమిన్ C, ఫొలేట్ ఉంటుంది. ఎర్రరక్త కణాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. పుచ్చకాయలో విటమిన్ C, నీటి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతాయి. ద్రాక్షలో అనామ్లజనకాలు, ఐరన్ ఉన్నాయి. హిమోగ్లోబిన్ పెంచడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి.