వాట్సాప్‌లో గ్రూప్ కాల్‌లో ఉన్నప్పుడు స్పెసిఫిక్ పర్సన్స్‌ను మ్యూట్ చేసే ఆప్షన్‌ను తెచ్చారు.

లాస్ట్ సీన్ స్టేటస్, అబౌట్, ప్రొఫైల్ ఫొటోను కూడా మనం కావాలనుకున్న యూజర్ల నుంచి హైడ్ చేయవచ్చు.

గ్రూప్ వాయిస్ కాల్స్‌కు కొత్త ఇంటర్‌ఫేస్‌ను అందించిన కొన్ని రోజులకు ఈ ఫీచర్ లాంచ్ అయింది.

గ్రూప్ వీడియో కాల్‌లో ఉండగానే అందులో ఒక వ్యక్తికి మెసేజ్ చేసే ఫీచర్ కూడా రానుంది.

వాట్సాప్ ఇటీవలే చాట్లను ఆండ్రాయిడ్ నుంచి ఐవోఎస్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకునే ఫీచర్‌ను కూడా తీసుకువచ్చింది.

వాట్సాప్ గ్రూప్ సభ్యుల సంఖ్యను 256 నుంచి 512కు పెంచింది.

వాట్సాప్ మెసేజ్‌లు డిలీట్ చేయడానికి టైమ్ రిస్ట్రిక్షన్‌ను 2 రోజుల 12 గంటలకు పెంచనుందని వార్తలు వస్తున్నాయి.

వాట్సాప్ గ్రూపుల్లో సభ్యులు పెట్టిన మెసేజ్‌లను డిలీట్ చేసే ఆప్షన్‌ను అడ్మిన్లకు కల్పించే ఫీచర్ కూడా త్వరలో రానుంది.

మనం ఆన్‌లైన్‌లో ఉన్నా అవతలివారికి తెలీకుండా కొత్త ప్రైవసీ ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానుంది.

వాట్సాప్ మే నెలలో 19 లక్షలకు పైగా ఖాతాలను బ్యాన్ చేసినట్లు ప్రకటించింది.