భారత డ్రైవింగ్ లైసెన్స్ చెల్లే దేశాలు ఇవే

విదేశాల్లో పూర్తిగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ మీదే ఆధారపడుతున్న భారతీయులు ఎంతోమంది.

కానీ కొన్ని దేశాల్లో మన దేశ డ్రైవింగ్ కొంత కాలపరిమితి వరకు పనిచేస్తుంది.

ఆస్ట్రేలియా
న్యూసౌత్ వేల్స్, సౌత్ ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియన్ క్యాపిటల్ టెరిటరీ ప్రాంతాల్లో ఏడాది పాటూ చెల్లుతుంది.

బ్రిటన్
ఇంగ్లాండు, స్కాట్లాండ్, వేల్స్ దేశాల్లో మన లైసెన్స్‌ను ఏడాది పాటూ అంగీకరిస్తారు.

జర్మనీ
మన లైసెన్స్‌తో జర్మనీల ఆరు నెలల పాటూ దర్జాగా కార్లు, బైకులపై తిరగచ్చు.

అమెరికా
ఏడాది పాటూ మన లైసెన్స్ చెల్లుతుంది.

స్వీడన్
ఈ దేశంలో ఏడాది వరకు మన లైసెన్స్ వాడుకోవచ్చు.

న్యూజిలాండ్
ఒక ఏడాది పాటూ చెల్లుతుంది.

సింగపూర్
ఏడాది పాటూ మన లైసెన్స్ కు కాలపరిమితి ఉంటుంది.

ఫిన్లాండ్ , దక్షిణాఫ్రికా, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ దేశాల్లో కూడా తక్కువ కాలపరిమితి వరకు మన డ్రైవింగ్ లైసెన్సును ఒప్పుకుంటారు.