ABP Desam

ఈ రోజు(ఫిబ్రవరి 1) బ్రహ్మానందం బర్త్‌డే. ఆయన గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందామా!

ABP Desam

బ్రహ్మానందం సినిమాల్లోకి రాకముందు తెలుగు లెక్చరర్‌గా పనిచేశారు.

ABP Desam

1987లో ‘అహ నా పెళ్లంట’ సినిమాతో బ్రహ్మీ టాలీవుడ్‌కు పరిచయమయ్యారు.

1000కిపైగా సినిమాల్లో కమెడియన్‌గా నటించి గిన్నీస్ వరల్డ్ రికార్డ్‌ సాధించారు.

బ్రహ్మీ మంచి నటుడే కాదు.. గొప్ప చిత్రాకారుడు కూడా.

స్నేహితులు ఇంటికి వస్తే బ్రహ్మానందమే స్వయంగా వంట చేస్తారు.

బ్రహ్మీ వంటలంటే ఎన్టీఆర్, రామ్ చరణ్‌కు చాలా ఇష్టమట.

బ్రహ్మానందం ఆధ్యాత్మికత పుస్తకాలు చదవడానికి ఇష్టపడతారు.

తనను సినిమాల్లో పరిచయం చేసిన దర్శకుడు జంద్యాల భారీ చిత్రాన్ని ఆయన ఇంట్లో పెట్టుకున్నారు.

దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకొనే ఏకైక కమెడియన్‌ బ్రహ్మీ.

రాత్రి 7 తర్వాత బ్రహ్మానందం బయటకు వెళ్లరు.

దాదాపు మూడు దశాబ్దాలు టాలీవుడ్‌ను ఏలిన హాస్య బ్రహ్మ మన బ్రహ్మీ.

బ్రహ్మీ 1956, ఫిబ్రవరి 1న గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జన్మించారు.

తొలిసారి వేషం వేసింది కూడా ఫిబ్రవరి 1వ తేదీనే.

All Images Credit: Raja Goutham/Instagram, Social Media