'ఆర్ఆర్ఆర్' నుంచి 'ఆచార్య', 'రాధే శ్యామ్', 'సర్కారు వారి పాట' తదితర సినిమా విడుదల తేదీలు మారాయి. ఏ సినిమా ఎప్పుడు వస్తోందో చూడండి. ఫిబ్రవరి 11న రవితేజ 'ఖిలాడి' విడుదల. అదే రోజున 'డీజే టిల్లు', 'సెహరి' సినిమాలు కూడా ఉన్నాయి. 'ఆర్ఆర్ఆర్' కంటే ముందు 'గంగూబాయి కతియావాడి'తో ఫిబ్రవరి 18న ఆలియా భట్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఫిబ్రవరి 24న 'వలిమై' విడుదల కానుంది. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అజిత్ హీరోగా నటించిన ఈ సినిమాలో కార్తికేయ విలన్. అయితే ఫిబ్రవరి 25న లేదంటే ఏప్రిల్ 1న 'భీమ్లా నాయక్'ను ప్రేక్షకుల ముందుకు ప్రకటించారు. రెండో తేదికి వచ్చే అవకాశాలు ఎక్కువ అట. వరుణ్ తేజ్ 'గని'ని 1ఫిబ్రవరిలో విడుదల చేస్తామన్నారు. 24కి వచ్చే అవకాశాలు ఎక్కువ... త్వరలో ప్రకటన రావచ్చని తెలిసింది. ఫిబ్రవరి 25న 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' విడుదల. ఒకవేళ 'భీమ్లా నాయక్' వస్తే వెనక్కి వెళ్లొచ్చని టాక్. మార్చి 11న 'రాధే శ్యామ్'. ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన 'ఆర్ఆర్ఆర్' మార్చి 25న విడుదల 'ఆర్ఆర్ఆర్' మార్చి 25కి రావడంతో ఆ రోజున రావాల్సిన 'రామారావు ఆన్ డ్యూటీ' వాయిదా పడుతోందని ఫిల్మ్ నగర్ ఖబర్. ఏప్రిల్ 14న 'కె.జి.యఫ్ 2' విడుదల తమిళ్ హీరో విజయ్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న 'బీస్ట్' విడుదల కూడా ఏప్రిల్ 14నే వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా రూపొందుతున్న 'ఎఫ్ 3' ఏప్రిల్ 28న విడుదల కానుంది. ఏప్రిల్ 29న తండ్రీతనయులు చిరంజీవి, రామ్ చరణ్ నటించిన 'ఆచార్య' విడుదల మే 12న మహేష్ బాబు 'సర్కారు వారి పాట' విడుదల. ప్రస్తుతానికి ఖరారైన విడుదల తేదీలు ఇవి!