వంటగదిలో ఈ తప్పులు చేయకండి కొన్నిరకాల వంటింటి అలవాట్లు దీర్ఘకాలంగా అనుసరించడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగే అవకాశం ఉంది. హాని కలిగించే ఆ అలవాట్లను వదిలి పెట్టడం చాలా అవసరం. చాలా మందికి రుబ్బు లేదా పిండి కలిపాక ఉప్పు సరిపోయిందో లేదో చూడటానికి కాస్త రుచి చూస్తారు. దానివల్ల సాల్మోనెల్లా అనే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుందట. మాంసాహారం, కూరగాయలు కోసేందుకు వేర్వేరు చాపింగ్ బోర్డులు కూడా ఉపయోగించాలి. గిన్నెలు తోమే స్పాంజిని ప్రతి నెలకోసారి మార్చాలి. లేకుంటే బ్యాక్టిరియా, హానికరమైన జెర్మ్‌లు దానిపై పేరుకుంటాయి. కిచెన్ కౌంటర్ పై చపాతీలు ఒత్తడం, కూరగాయలు కోయడం చేయవద్దు. కంటికి కనిపించని సూక్ష్మక్రిములు చపాతీలతో పాటూ పొట్టలో చేరుతాయి.