ఆర్ధరైటిస్ ఉన్న వారు ఈ ఆహారాలు తినకూడదు చలికాలంలో ఆర్ధరైటిస్‌తో బాధపడుతున్నవారికి నొప్పులు మరింత ఎక్కువవుతాయి. ఆర్ధరైటిస్ రావడానికి సరైన కారణాలు కచ్చితంగా తెలియనప్పటికీ ఆహారం కూడా ప్రభావం చూపిస్తుందని నమ్ముతున్నారు వైద్యులు. కొన్ని ఆహారాలు తినడం కీళ్లనొప్పులు, వాపులు మరింత పెరిగే అవకాశం ఉంది. సంతృప్త, ట్రాన్స్‌ఫ్యాట్‌లు అధికంగా ఉండే డీప్‌గా వేయించిన ఆహారాలను దూరం పెట్టాలి. ఆల్కహాల్‌లో ఉండే యూరిక్ ఆసిడ్ వల్ల కీళ్ల నొప్పులు మరింత తీవ్రంగా మారుతాయి. తియ్యటి సోడాలు కూడా తాగకూడదు. అధికంగా శుధ్ది చేసిన ఆహారాన్ని తినకూడదు. పంచదారతో చేసిన పదార్థాలను పక్కన పెట్టాలి. చలి వాతావరణంలో ఆర్ధరైటిస్ ఉన్న వారు టమోటాలు, మిరియాలు, బంగాళాదుంపలు, వంకాయలతో వంటి కూరలను తక్కువగా తినాలి. ఇవి మంట లక్షణాలను పెంచుతాయి. ఈ కూరగాయలను తినకపోవడం వల్ల పోషకాహారలోపం తలెత్తకుండా వైద్యుడిని సంప్రదించి తగిన సలహాలు కూడా పొందాలి.