తినే పదార్థాల విషయంలో ప్రజల్లో చాలా అపోహలు, భయాలు ఉన్నాయి. అందులో ఒకటి పొట్లకాయ, గుడ్డు కలిపి వండకూడదు అని.
ఆ రెండూ కలిపి వండితే విషపూరితం అవుతుందని, తినకూడదనే భయాలు ఉన్నాయి.
శాస్త్రీయంగా దీన్ని ఇంతవరకు ఎవరూ నిరూపించలేకపోయారు.
పొట్లకాయ, గుడ్డు కలిపి వండితే విషపూరితం అవాస్తవం అంటున్నారు సైంటిస్టులు.
గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారు ఈ కాంబినేషన్‌కు దూరంగా ఉంటే మంచిది.
పొట్లకాయలో నీటి శాతం అధికం ఇది త్వరగా అరిగిపోతుంది. కానీ కోడిగుడ్డులో ప్రోటీన్స్, కొవ్వుఆమ్లాలు అధికంగా ఉంటాయి. అందుకే ఇది అరగడానికి కాస్త సమయం పడుతుంది.
ఈ రెండు కలిపి వండినప్పు జీర్ణమయ్యే సమయంలో తేడాలొస్తాయి. అలాంటప్పుడు కొందరిలో స్వల్పకాలం పాటూ గ్యాస్ సమస్య వచ్చే అవకాశం ఉంది.
ఇది అందరిలోనూ రావాలని లేదు. ఇంతకుమించి ఈ కూరతో వచ్చే ప్రమాదం ఏమీ లేదు.