పిల్లలకు ఫూల్ మఖానా పెడుతున్నారా? లేదా?



పూల్ మఖాన లేదా ఫాక్స్ నట్స్... ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహారం.



వాల్ నట్స్, బాదంపప్పు, జీడిపప్పులాగే ఇవి కూడా ఒక రకమైన నట్స్. వీటిలో మన శరీరానికి అత్యవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి.



ఫూల్ మఖానాను నెయ్యిలో వేయించి పిల్లలకు ఇస్తే చాలు... చాలా సింపుల్ గా ఈ స్నాక్స్ తయారైపోతాయి.



వారి మెదడు ఎదుగుదలకు, శరీర ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో యాంటీ ఏజింగ్ లక్షణాలు ఎక్కువ.



వీటివల్ల చర్మం మెరుపు సంతరించుకుంటుంది. దీంట్లో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగ్గా పనిచేసేలా చేస్తుంది.



వీటిలో ఉండే ఫైటోన్యూట్రియంట్లు శరీరాన్ని అనేక సీజనల్ వ్యాధుల నుంచి కాపాడతాయి.



గుండెకు రక్తప్రసరణ, ఆక్సిజన్ సరిగా అందేలా చేస్తాయి. ఇతర అవయవాలకు కూడా ఆక్సిజన్ పోషకాలు అందేలా చేస్తాయి.



మూత్రపిండాలను కాపాడడంలో కూడా పూల్ మఖానా ముందుంటుంది.