రొయ్యలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో విటమిన్ ఈ, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. జింక్, అయోడిన్ వంటి ఖనిజాలు థైరాయిడ్ గ్రంథికి మేలు చేస్తాయి. కండరాలను బలంగా ఉంచుతాయి. ఇన్ఫెక్షన్లు సోకకుండా శరీరాన్ని కాపాడుతాయి. రొయ్యలలో సెలీనియం ఉంటుంది. ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇందులో అస్టాక్సంతిన్ అనే ఖనిజం ఉంటుంది. ఇది క్యాన్సర్, గుండె జబ్బులతో సహా ఇతర దీర్ఘకాలిక వ్యాధులను తగ్గిస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది. రొయ్యలలో తక్కువ కొవ్వు, కేలరీలు ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ ఫుడ్. గుండెజబ్బులను నివారిస్తుంది. రొయ్యలలో ఉండే పోషకాలు బలమైన ఎముకలను నిర్మించడంలో సహాయపడతాయి. అలసటను కూడా దూరం చేస్తాయి. అల్జీమర్స్ వ్యాధితో బాధపడేవారికి రొయ్యలు మంచి ఆహారం. మంటను తగ్గించడంలో సహాయపడతాయి. రొయ్యలలో ఒమేగా-3 కొవ్వులు ఉంటాయి. వీటిని తినడం వల్ల గుండె ఆరోగ్యం బాగుంటుంది. ఐరన్ శరీరానికి ఆక్సిజన్ సరిగ్గా పంపిణీ చేయడంలో కీలకంగా పాత్ర పోషిస్తుంది. రోయ్యలలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రొయ్యలలో ఆరోగ్యకరమైన కొవ్వు ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచవు.