విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండే కూరగాయాలని పిల్లలు ఎక్కువగా తినేలా చెయ్యాలి.

గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ చలికాలంలో తప్పనిసరిగా తినాలి. ఎందుకంటే వాటిలో పోషకాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.

చల్లని వాతావరణం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. బ్యాక్టీరియాతో పోరాడేలా రోగనిరోధక శక్తి మెరుగయ్యే ఆహారం పెట్టాలి.

ఆకుకూరలు కలిపి పరోటాలు చేసి ఇస్తే ఇష్టంగా తింటారు.

శీతాకాలంలో వచ్చే పండ్లు అధిక పోషక విలువలు కలిగి ఉంటాయి. నారింజ, నిమ్మ, దానిమ్మ పండ్లలో విటమిన్ సి, ఫైబర్ ఉంటుంది.

డ్రై ఫ్రూట్స్, నట్స్ లో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఈ ఆహారాలు సులభంగా జీర్ణమవుతాయి.

చిలగడదుంపలో విటమిన్ ఏ, బీటా కెరోటిన్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. వీటిని కాల్చిన తర్వాత తినడం మంచిది.

తేనె పిల్లల ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. తేనె తీసుకోవడం వల్ల గొంతు నొప్పి, దగ్గు కూడా తగ్గుతుంది.

Image Source: Pexels

డ్రై ఫ్రూట్స్ పొడి చేసుకుని పెట్టుకుని పాలల్లో కలిపి ఇస్తే చాలా రుచిగా ఉంటాయి. అవి వాళ్ళని వెచ్చగా కూడా ఉంచుతుంది.