కొరియన్లకు నెంబర్ 4 అంటే ఎందుకంత భయం? కొరియా ప్రజలకు 4వ నెంబర్ అంటే చాలా భయం. కొరియన్లు 4ను అశుభంగా భావిస్తారు. 4 నెంబర్ చావును సూచిస్తుందని కొరియన్లు భావిస్తారు. కొరియాలో మరణాన్ని ‘సా’ అంటారు. 4ను కూడా ‘సా’ అనే పిలుస్తారు. కొరియాలో సంఖ్యలు పలికేప్పుడు నాలుగు పలకరు. ఎవరూ నాలుగు సంఖ్యను ఉపయోగించరు. చివరికి వారి అపార్టమెంట్లలో 4వ అంతస్తు కూడా ఉండదు. 3వ అంతస్తు తర్వాత నేరుగా 5వ అంతస్తు వస్తుంది. అయినా, 5వ అంతస్తులోని ఫ్లాట్లు మిగతా ఫ్లోర్ల కంటే తక్కువ రేటుకు అమ్ముడవుతాయట. All Photos Credit: pixabay.com