హార్ట్ ఎటాక్ వచ్చినపుడు వెంటనే వాడే మందు ఆస్పిరిన్. ఇతర అనారోగ్యాల కోసం మందులు వాడుతున్న వారు కూడా నిపుణుల సలహా లేకుండా ఆస్ప్రిన్ తీసుకోకూడదు. ఆస్ప్రిన్ సెన్సిటివిటీ, రక్తానికి సంబంధించిన సమస్యలు, అల్సర్లు, జీర్ణ సంబంధ సమస్యలు ఉన్నవారు ఆస్ప్రిన్ తీసుకోకూడదు. ఆస్ప్రిన్‌ను 163-325 మిల్లీగ్రాముల మోతాదులో తీసుకోవాలని నిపుణుల సిఫారసు. ఆస్ప్రిన్ నాన్-ఎంటరిక్ కోటెడ్ లేదా నమిలేందుకు అనువైన ఆస్ప్రిన్ తీసుకోవాలి. ఆస్ప్రిన్ రక్తం చిక్కబడడాన్ని నిరోధించే పని చాలా త్వరగా సమర్థవంతంగా నిర్వహించగలదు. గుండె పోటు లక్షణాలు కనిపించిన వెంటనే ఆస్ప్రిన్ తీసుకోవడం అత్యవసరం. గుండె నొప్పి వచ్చినప్పుడు ఆస్స్రిన్‌ను నమిలి తినేయాలి లేదా చూర్ణం చేసి మింగడం మంచిది మాత్రను నమలడం వల్ల అది.. త్వరగా రక్తంలోకి కలిసి ప్రమాదం నుంచి రక్షిస్తుంది. Representational image:Pexels and pixabay