ఏసీ వాడితే అందం తరిగిపోవడం ఖాయం ఏసీలో ఉండడం అనేది గొప్పగా భావిస్తారు ఎంతోమంది. నిజానికి అది ఏ మాత్రం ఆరోగ్యకరం కాదు. అవసరం ఉన్నా, లేకపోయినా ఈ కృత్రిమ చల్లదనాన్ని ఇచ్చే ఏసీలోనే ఉండడం వల్ల ఆరోగ్యం పై ఎన్నో మార్పులు కనిపిస్తాయి. ఇలా ఎయిర్ కండిషన్లలో ఉండే వారికి చర్మం అనారోగ్యం పాలవుతుంది. ముడతలు పడి, చర్మం కుచించుకుపోయి ముసలిగా కనిపిస్తుంది. 30 ఏళ్లలో ఉన్నా కూడా 40 ఏళ్ల వయసు వారిలా కనిపించడం మొదలవుతుంది. నిత్యం ఏసీలో ఉండడం వల్ల చర్మం లో చెమట, నూనె ఉత్పత్తి కావడం తగ్గిపోతుంది. దీనివల్ల వ్యర్ధాలన్నీ చర్మంలోనే ఉండిపోతాయి. దీనివల్ల మొటిమలు వచ్చే అవకాశం పెరుగుతుంది. చర్మం కాంతి హీనంగా తయారవుతుంది. పాలిపోయినట్లు కనిపిస్తుంది. ఏసీలో నిత్యం ఉండే వారిలో చర్మంలో తేమ తగ్గిపోతుంది. దీనివల్ల పొడిదనం పెరిగి కొల్లాజెన్ అనే ప్రోటీన్ ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. దీనివల్ల చూడగానే ముఖం ముసలిగా కనిపించే అవకాశం ఉంది.