తినేందుకు రెడీ, కానీ వంట చేయం



కోటి విద్యలు కూటి కొరకే అంటారు. ఏ పని చేసినా చివరికి అది పొట్ట నింపుకోవడం కోసమే.



తినడానికి అందరూ రెడీనే, కానీ వంట చేయడానికి మాత్రం రెడీగా లేము అని చెబుతున్నారు ఎంతోమంది.



ఎంతమందికి వంట చేయడం ఇష్టం లేదో తెలుసుకోవడం కోసం అమెరికాలో సర్వే నిర్వహించారు.



ఈ సర్వేలో వంట చేయడం ఇష్టం లేదని ప్రతి వందమందిలో 30 మంది చెప్పారు.



వంట చేయడం వల్ల చాలా అలసిపోతామని, రోజూ వండడం చాలా బోరింగ్ విషయమని వివరిస్తున్నారు.



ప్రపంచవ్యాప్తంగా చేసిన సర్వేలో కూడా 29 శాతం మంది వంట చేయడం ఇష్టం లేదని ఒప్పుకున్నారు.



రోజూ వంట చేసే వారిలో ఎంతోమంది తమ ఇంట్లోని ఇతరులను ఒక్కరోజైనా వంట చేయమని అడుగుతూ ఉంటారట.



వంట చేయడం కష్టంగా అనిపించే రెడీ టు ఈట్, రెడీ టు కుక్ ఆహారాలను అధికంగా కొని తినేసే వారి సంఖ్య పెరిగిపోతోంది.