మహిళలు నగ్నంగా తిరగొచ్చు - ఆ దేశంలో ప్రత్యేక చట్టం నగ్నత్వం అనగానే మనం హవ్వా అనుకుంటాం. కానీ, కొన్ని దేశాల ప్రజలు దాన్ని స్వేచ్ఛగా భావిస్తారు. జర్మనీలో ఇలాంటివి జుజుబీ. ముఖ్యంగా బెర్లిన్‌లో మహిళలు టాప్‌లెస్‌గా ఈత కొట్టొచ్చు. పురుషులతో సమానంగా మహిళలు టాప్ లేకుండా జలకాలడవచ్చని ప్రభుత్వమే వెల్లడించింది. అదేంటీ అనుకుంటున్నారా? అయితే, కాసేపు ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్దాం. ఓ మహిళ.. పురుషుల తరహాలో టాప్ విప్పేసి అర్థనగ్నంగా స్విమ్మింగ్ పూల్‌లోకి దూకింది. దీంతో అక్కడివారు విచక్షణ లేకుండా.. ఏమిటా పనులని ఆమెను అక్కడి నుంచి గెంటేశారు. ఆ అవమాన భారంతో ఆమె కోర్టుకెక్కింది. మహిళలపై ఈ వివక్ష తగదని వాదించింది. ఆమె వాదనలో న్యాయముందని కోర్టు కూడా సానుకూలంగా తీర్పు ఇచ్చింది. ఓవర్ యాక్షన్ ఎందుకులే అని పురుషులూ నోరు మూసుకున్నారు. సర్కారు కూడా సై అంది. దీంతో ఇప్పుడు బెర్లిన్ మహిళలు స్విమ్మింగ్ పూల్స్‌లో టాప్ లేకుండానే ఈత కొడుతున్నారు. ఇదంతా చదివిన తర్వాత మీరు కూడా ఓ సారి బెర్లిన్ వెళ్లి వస్తే పోలే.. అని చిలిపిగా ఆలోచిస్తున్నారా? Representational Image and Videos Credit: Pexels