తమిళ ఇండస్ట్రీలో దళపతి విజయ్ ‘లియో’ కలెక్షన్ల జోరు ఏమాత్రం ఆగడం లేదు. 11 రోజుల్లో ‘లియో’ బాక్సాఫీస్ వద్ద రూ.530 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. 11వ రోజు ఆదివారం కూడా ప్రపంచవ్యాప్తంగా రూ.25.85 కోట్లు సాధించింది. మొత్తంగా ఇప్పటివరకు రూ.266.65 కోట్ల డిస్ట్రిబ్యూషర్లకు షేర్ వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ‘లియో’ థియేట్రికల్ రైట్స్ రూ.215 కోట్లకు అమ్ముడుపోయాయి. రూ.50 కోట్లకు పైగా లాభం సాధించి సూపర్ హిట్‌గా నిలిచింది. తెలుగు రాష్ట్రాలకు గానూ ‘లియో’ హక్కులను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ దక్కించుకుంది. రూ.16 కోట్లకు సూర్యదేవర నాగవంశీ ఈ హక్కులను దక్కించుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో లియో ఇప్పటి వరకు రూ.44.6 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది.