ఎలాన్ మస్క్ ఎక్స్/ట్విట్టర్‌ను కొనుగోలు చేశాక అందులో ఎన్నో మార్పులు చేశారు. ఇటీవలే ఇందులో ఆడియో, వీడియో కాల్స్‌ను కూడా ప్రారంభించారు. త్వరలో ఈ యాప్‌ను టీవీల్లో కూడా వాడేయచ్చంట. గూగుల్ వీడియో ప్లాట్‌ఫాం యూట్యూబ్‌తో ఎక్స్/ట్విట్టర్ పోటీ పడనుందన్న మాట. ఈ విషయాన్ని ఎలాన్ మస్క్ స్వయంగా ప్రకటించారు. ఈ సర్వీస్ ప్రారంభం అయితే ఫోన్ తరహాలోనే టీవీలో కూడా ఎక్స్‌ను బ్రౌజ్ చేయవచ్చన్న మాట. మొదటగా అమెజాన్ స్టిక్, శాంసంగ్ స్మార్ట్ టీవీలకు ఇది విడుదల కానుందట. ఒక యూజర్ ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఎలాన్ మస్క్ ఈ పోస్టు చేశారు.