మోటరోలా ఫోన్లు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందాయి.

ఈ బ్రాండ్ ఫోన్లను ఏ కంపెనీ తయారు చేస్తుందో మీకు తెలుసా?

మొదట మోటరోలా యునైటెడ్ స్టేట్స్‌లోని చికాగోలో స్థాపించబడింది.

2012 మేలో గూగుల్ ఈ కంపెనీని 12.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది.

గూగుల్ ఈ కంపెనీని కొనుగోలు చేసిన రెండు ఏళ్ళ తర్వాత విక్రయించింది.

2014 అక్టోబరులో గూగుల్ మోటరోలాను లెనోవోకు విక్రయించింది.

లెనోవో ప్రముఖ చైనా కంపెనీ.

లెనోవో, మోటరోలాను కొనుగోలు చేయడానికి గూగుల్‌కు 2.91 బిలియన్ డాలర్లు చెల్లించింది.

లెనోవో యాజమాన్యంలో ఉన్నప్పటికీ, మోటరోలా ప్రధాన కార్యాలయం చికాగోలోనే ఉంది.