పవర్ బ్యాంక్ ఉపయోగించడం సాధారణంగా సురక్షితం.

కానీ లోకల్ పవర్ బ్యాంక్‌ లు వాడితే ఫోన్ పాడయ్యే అవకాశం ఉంది.

తక్కువ నాణ్యత గల చార్జింగ్ కేబుళ్ల వాడకం బ్యాటరీని దెబ్బతీసే అవకాశం ఉంది.

BIS లేదా బ్రాండెడ్ కంపెనీల సర్టిఫైడ్ పవర్ బ్యాంక్‌లను మాత్రమే ఉపయోగించాలి.

పవర్ బ్యాంక్ యొక్క అవుట్‌పుట్ వోల్టేజ్, అంపియర్ మీ స్మార్ట్‌ఫోన్ చార్జింగ్ స్పెసిఫికేషన్‌లకు సరిపోవాలి

తక్కువ నాణ్యత గల పవర్ బ్యాంక్‌లు ఓవర్‌చార్జింగ్‌ను నియంత్రించలేవు, ఫలితంగా బ్యాటరీ పనితీరు తగ్గిపోతుంది.

పవర్ బ్యాంక్ అధిక వోల్టేజ్ ఇస్తే లేదా స్మార్ట్‌ఫోన్‌తో ఉపయోగిస్తున్నప్పుడు వేడెక్కితే, బ్యాటరీ జీవితకాలం తగ్గవచ్చు.

చిన్న చిన్న ఛార్జింగ్‌లు చేసుకుంటూ పోకుండా, అవసరమైనప్పుడు మాత్రమే పవర్ బ్యాంక్‌ను వాడండి.

పవర్ బ్యాంక్ వాడేటప్పుడు ఫోన్‌ను అధికంగా ఉపయోగించొద్దు.